పోలీసు విపత్తు దళం సాధన | Sakshi
Sakshi News home page

పోలీసు విపత్తు దళం సాధన

Published Thu, Dec 7 2023 12:52 AM

ముల్లకట్ట వద్ద రీహార్సల్‌ చేస్తున్న సీఐ రాజు, ఎస్సైలు, విపత్తు దళం - Sakshi

ఏటూరునాగారం/వాజేడు: మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావం ఏజెన్సీపై పడే అవకాశం ఉండడంతో ఎస్పీ గాష్‌ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్‌ ఆదేశాల మేరకు మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరిలో హైపవర్‌ బోటుతో పోలీసు విపత్తు దళం బుధవారం సాధన చేపట్టింది. సీఐ మండల రాజు, ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌, వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విపత్తుదళం లైఫ్‌ జాకెట్స్‌ వేసుకొని హైపవర్‌ బోటులో వరదలో ఎంత మేర కు స్పీడ్‌ వెళ్లాలి.. ఆపదలో ఉన్నవారిని ఎలా రక్షించాలని రీహార్సల్‌ చేపట్టారు. వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచి ంచారు. వరదల్లో ఎవరైనా చిక్కుకుంటే వెంటనే డయల్‌ 100, స్థానిక ఎస్సై ఫోన్‌ నంబర్‌ 8712670090కు సమాచారం ఇవ్వాలని కోరారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద ఏటూరునాగారం సీఐ రాజు, ఎస్సై కృష్ణప్రసాద్‌, వాజేడు వెంకటేశ్వర్‌ రావు సమక్షంలో రిహార్సల్స్‌ చేపట్టారు.

బోటుతో గోదావరిలో పోలీసులు
1/1

బోటుతో గోదావరిలో పోలీసులు

Advertisement

తప్పక చదవండి

Advertisement