హోంగార్డుల సేవలు అమోఘమని ఎస్పీ గాష్‌ఆలం ప్రశంసించారు | Sakshi
Sakshi News home page

హోంగార్డుల సేవలు అమోఘమని ఎస్పీ గాష్‌ఆలం ప్రశంసించారు

Published Thu, Dec 7 2023 12:52 AM

ఎస్పీకి జ్ఞాపికను అందజేస్తున్న హోంగార్డులు - Sakshi

ములుగు: హోంగార్డుల సేవలు అమోఘమని ఎస్పీ గాష్‌ఆలం ప్రశంసించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో బుధవారం హోంగార్డ్‌ రైజింగ్‌ డే వేడుకలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హోంగార్డులు క్షేత్ర స్థాయిలో నిరంతరం విధులు నిర్వహిస్తూ పోలీస్‌ స్టేషన్లు, కార్యాలయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో లా అండ్‌ ఆర్డర్‌ అమలుతో పాటుగా బందోబస్తు సమయాల్లో హోంగార్డ్స్‌ ఆఫీసర్స్‌ కీలకమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన పలువురిని సన్మానించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హోంగార్డ్స్‌ పిల్లల చదువు కోసం ఎలాంటి సహాయమైనా పోలీస్‌ శాఖ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీకి హోంగార్డులు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్‌ ఆర్‌ఐ వెంకటనారాయణ, 70 మంది హోంగార్డ్స్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement