ఆనందోత్సాహాలతో ఉగాది | Sakshi
Sakshi News home page

ఆనందోత్సాహాలతో ఉగాది

Published Thu, Mar 23 2023 1:10 AM

జిల్లా కేంద్రంలో పంచాంగ శ్రవణంలో వేదపండితుడు దుర్గి శ్రీకాంత్‌ శర్మ  - Sakshi

శోభకృత నామ సంవత్సరానికి

ఘనంగా ఆహ్వానం

ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

పంచాంగ శ్రవణంలో

వేదపండితులు బిజీబిజీ

ఉన్నతాధికారిని సైతం

బురిడీ కొట్టించి..

మామూళ్లకు అలవాటు పడిన సివిల్‌ సప్లయ్‌ శాఖలోని ఓ అధికారితో పాటు పలువురు సిబ్బంది సదరు మిల్లు యజమానికి ఎప్పటి నుంచో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి భారీగా మడుపులు అందుకోవడంతో ఆ అధికారి అన్నీ తానై దగ్గరుండి వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లోనివే భారీగా పెండింగ్‌ ఉన్నప్పటికీ రికార్డుల్లో జీరో లేదా అతి తక్కువ మొత్తంలో చూపించి.. సదరు మిల్లు యజమానికి మేలు చేసేలా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వాల్సిన ఓ కీలక అధికారిని సైతం బురిడీ కొట్టించి.. సదరు మిల్లర్‌కు వచ్చే సీజన్‌కు సంబంధించి కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఈ బాగోతంలో పెద్ద ఎత్తున చేతులు మారగా.. పలువురు అధికారులు, సిబ్బంది వాటాల చొప్పున పంచుకున్నట్లు తెలిసింది.

అచ్చంపేట/కందనూలు: తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని బుధవారం జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. శుభకృత్‌ నామ సంవత్సర తీపి, చేదు అనుభవాలను మరిచి జిల్లాలో శోభకృత నామ సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. తెల్లవారుజామునే లేచి ఇళ్లలో దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రానున్న సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకున్నారు. ఉగాదికి ప్రతీకగా నిలిచే షడ్రుచుల సమ్మెళనం పచ్చడి, బక్షాలు సేవించారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని గ్రామాల్లో పండుగను వైభవంగా జరుపుకొన్నారు. ఈ పండుగ అంటేనే పంచాంగ శ్రవణాలకు పెట్టింది పేరు. జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం, రామ్‌నగర్‌, సుబ్రమణేశ్వరస్వామి, హౌసింగ్‌ బోర్డు వేంకటేశ్వర ఆలయాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో స్థానిక పండితులు పంచాంగ శ్రవణాలు చదువుతూ జిల్లా భవిష్యత్తును వివరించడంతోపాటు, ప్రజలు తమతమ రాశి ఫలాలు, జాతక చక్రాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. అలాగే, ఆలయాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.

సిరిసంపదలు కలగాలని..

రైతులు కొత్త సంవత్సరం రోజున వారి వారి వ్యవసాయ పొల్లాలో నాగలిని తోలి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గోవులను అలంకరించి పూజలు చేసి పొలాల్లో ఐదుసార్లు నాగలిసాళ్లు పట్టించారు. ఇలా చేయడం వల్ల పాడి పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. చిరుధాన్యాలను పొలాల్లో చల్లి దేవుడికి కొబ్బరి కాయ కొట్టి, నైవేద్యం పెట్టారు. ఆనంతరం నాగలిసాళ్లు పట్టించారు. సిరిసంపదలతో ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య గడపాలని ప్రార్థించారు. కులవృత్తుల వారు వస్తువులకు, పరికరాలకు పూజలు చేశారు.

నల్లమల క్షేత్రాలు కిటకిట

శ్రీశైలం ఉత్తర ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఆభిషేకం, అర్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తులు ఆధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో ఉగాది పర్వదిన ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.

సీఎమ్మార్‌ రైస్‌కు సంబంధించి మేము ఎవ్వరికీ క్లీన్‌ చీట్‌ ఇవ్వలేదు. కేటాయించిన వాటిలో మూడు లేదా నాలుగు ఏసీకేలు మాత్రమే పెట్టాల్సి ఉన్న మిల్లర్లకు వచ్చే సీజన్‌కు సంబంధించి సీఎమ్మార్‌ ధాన్యం కేటాయించాం. ప్రతి మిల్లర్‌ నుంచి వంద శాతం సీఎమ్మార్‌ బియ్యం ప్రభుత్వానికి అందేలా చూస్తాం. ఎవరినీ వదిలేది లేదు. ఈ వ్యవహారం ఐదారు నెలల క్రితం జరిగింది. ఇటీవల మిల్లర్లు కొట్టుకున్న విషయం నా దృష్టికి రాలేదు.

– ప్రసాద్‌రావు, సివిల్‌ సప్లయ్‌ డీఎం

ఘనంగా బీరప్ప బండారోత్సవం

నారాయణపేట టౌన్‌: మండలంలోని సింగారం గ్రామంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న బీరప్ప బండారు ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఐదేళ్లకు ఒక్కసారి నిర్వహించే ఈ ఉత్సవాలలో చివరిరోజు యానగుంది బీరప్ప ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి పెద్ద బోనంకుండతో గ్రామంలో ఊరేగింపుతో ఎల్లమ్మ ఆలయం చేరుకున్నారు.గ్రామస్తులు తమ బంధువులకు కొత్త బట్టలతో ఒడి బియ్యం పోసి బండారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఐదారు నెలల క్రితం జరిగింది..

సమృద్ధిగా వర్షాలు.. వేగంగా అభివృద్ధి

శోభకృత నామ సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అర్చక సంఘం గౌరవ జిల్లా అధ్యక్షుడు దుర్గి శ్రీకాంత్‌ శర్మ, సుబ్రమణ్యేశ్వర ఆలయ ప్రధాన అర్చకుడు నర్వ వేంకటేశ్వర శర్మ వివరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుబ్రమణ్యేశ్వర ఆలయం, నాగనూలు అయ్యప్ప స్వామి ఆలయంలో వేదపండితులు పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాదిలో జిల్లా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారు. వర్షాలు అధికంగా పడతాయని, సాగు నీళ్లు సమృద్ధిగా ఉంటాయని, రైతులు సరైన సస్యరక్షణ చర్యలతో పంటలు సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందని, అలాగే పంటలపై తెగుళ్ల ప్రభావం ఉంటుందన్నారు. శాంతిభద్రత చర్యలు పటిష్టంగా చేపడతారని, జల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంటుందని, రాజకీయాల్లో నాయకుల వాగ్ధానాలు ఎక్కువగా ఉండడంతోపాటు ప్రత్యారోపణలు అధికమవుతాయని, జిల్లా రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని అర్చకులు వివరించారు.

జిల్లా కేంద్రంలోని సుబ్రమణ్యేశ్వర 
ఆలయంలో పచ్చడి పంపిణీ
1/3

జిల్లా కేంద్రంలోని సుబ్రమణ్యేశ్వర ఆలయంలో పచ్చడి పంపిణీ

ఉగాదిని పురస్కరించుకుని పొలిశెట్టిపల్లిలో 
నిర్వహించిన బండలాగుడు పోటీలు
2/3

ఉగాదిని పురస్కరించుకుని పొలిశెట్టిపల్లిలో నిర్వహించిన బండలాగుడు పోటీలు

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement