లక్కీ డిప్‌కు ఏర్పాట్లు పూర్తి | Sakshi
Sakshi News home page

లక్కీ డిప్‌కు ఏర్పాట్లు పూర్తి

Published Mon, Aug 21 2023 12:40 AM

-

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 67 మద్యం దుకాణాలకు వచ్చిన 2,524 దరఖాస్తులకు సోమవారం సమీకృత జిల్లా సముదాయ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి షేక్‌ ఫయాజుద్దీన్‌ తెలిపారు. ఆదివారం సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీ డ్రాకు నిర్వహించే ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే లక్కీ డ్రాకు 10 గంటలకు హాజరు కావాలన్నారు. ఎకై ్సజ్‌ స్టేషన్ల వారీగా లక్కీ డ్రా నిర్వహిస్తామని ముందుగా నాగర్‌కర్నూల్‌ పరిధిలోని పది దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన దరఖాస్తుదారులనే హాల్లోకి అనుమతిస్తామన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని, హాజరయ్యే టెండర్‌దారుల వాహనాలకు వైభవ్‌ ఫంక్షన్‌ హాల్‌ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణాలకు ఎంపికై న టెండర్‌ దారులు తప్పనిసరిగా అదే రోజు మొదటి విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ రూ.9.17లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అక్కడే బ్యాంకు వారి ఆధ్వర్యంలో అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

Advertisement
Advertisement