595 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ | Sakshi
Sakshi News home page

595 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

Published Thu, Nov 30 2023 12:46 AM

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం  - Sakshi

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని 802 పోలింగ్‌ కేంద్రాలకు గాను 595 పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో నిఘా కళ్లు వెబ్‌ కాస్టింగ్‌ పక్కాగా ఏర్పాటు చేయాలని ఈడీఎంను ఆదేశించారు. మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక పోలింగ్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలోని 106 సెక్టార్‌ అధికారుల వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ అనుసంధానం చేశామన్నారు. వాహనాలు ఏ పరిధిలో ఉన్నాయో గుర్తిస్తామన్నారు. ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెంటనే చేరేలా జిల్లా కంట్రోల్‌ రూం నుంచి ఎప్పటికప్పుడు దిశా నిర్దేశాన్ని అందజేసి, పోలింగ్‌ కేంద్రాల సమస్యలను అత్యంత తక్కువ సమయంలోనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశామన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని ఎన్నికల సిబ్బందిని ఈవీఎంల ద్వారా తరలించేందుకు 100 ఆర్టీసీ బస్సులను వినియోగించామన్నారు. వాటికి జీపీఆర్‌ఎస్‌ అనుసంధానం చేశామన్నారు. అదేవిధంగా చెంచుపెంటల్లోని 9 పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేకంగా వీడియో ఫొటో కెమెరాల ద్వారా పోలింగ్‌ ప్రక్రియను రికార్డ్‌ చేస్తున్నట్లు చెప్పారు. 198 సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కంట్రోల్‌ రూం నోడల్‌ అధికారిగా ఈడీఎం నరేష్‌ను నియమించనున్నట్లు తెలియజేశారు. ఈ ప్రక్రియలో నిష్ణార్ధులైన ఎన్‌ఐసీ కోఆర్డినేటర్‌ హర్షద్‌ రాఘవేంద్ర, హేమంత్‌, సాయి, కీర్తన్‌, ప్రసాద్‌, గురుబ్రహ్మం, శ్రీకర్‌ యాదవ్‌, తదితరులు జిల్లా ఎన్నికల కంట్రోల్‌ రూం ప్రక్రియను కొనసాగించనున్నట్లు వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement