కొల్లాపూర్‌ | Sakshi
Sakshi News home page

కొల్లాపూర్‌

Published Thu, Nov 30 2023 12:46 AM

- - Sakshi

టప్రోలు అత్యంత ప్రాచీనమైన సంస్థానం. ఈ సంస్థానాధీశులు కొల్లాపూర్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించడం ద్వారా కొల్లాపూర్‌ సంస్థానంగా పేరొచ్చింది. ఈ సంస్థానం కృష్ణానది ఒడ్డున, నల్లమల అటవీప్రాంతం ముందు విస్తరించి ఉంది. పాలకులంతా సురభివంశస్తులే కావడంతో వీరిని సురభిసంస్థానాధీశులు అని పిలుస్తారు. 1871లో నిర్మించిన కొల్లాపూర్‌ రాజవారి బంగ్లాను చంద్రమహల్‌, మంత్రమహల్‌, రాణిమహల్‌గా విభజించారు. 18వ శతాబ్దంలోనే ధర్మాస్పత్రిని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్యం అందించేవారు. వీరికి ఆ రోజుల్లోనే సొంత విమానం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఈ సంస్థానానికి చెందిన వారు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. అయినప్పటికీ కొల్లాపూర్‌ చివరి సంస్థానాధీశుడైన రాజా వెంకట జగన్నాథరావుకు బురుగుల రామకృష్ణారావుతో మంచి సాన్నిహిత్యం ఉండేది. స్నేహభావంతోనే తమ బంధువైన నర్సింగరావును 1957లో అసెంబ్లీ ఎన్నికల్లో రాజా వెంకటజగన్నాథరావు బాధ్యత తీసుకొని గెలిపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement