ఉత్సాహంగా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

Published Mon, Dec 25 2023 12:54 AM

పోటీలను ప్రారంభిస్తున్న మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనుయాదవ్‌    - Sakshi

అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఆదివారం మాస్టర్‌ అథ్లెటిక్స్‌ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎడ్మ శ్రీనుయాదవ్‌ పోటీలను ప్రారంభించగా.. జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ వెటరన్‌ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 100 మీ., 200 మీ., 400 మీ., 800 మీ., 1500 మీ., 5,000 మీ., 10,000 మీటర్ల పరుగు పందెం, వాకింగ్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, ట్రిపుల్‌ జంప్‌, షార్ట్‌ఫుట్‌, హ్యామర్‌ త్రో, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో తదితర పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శ్రీనుయాదవ్‌ మాట్లాడుతూ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రీడల్లో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు. కార్యక్రమంలో మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement