క్రిస్మస్‌ శోభ | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ శోభ

Published Mon, Dec 25 2023 12:54 AM

- - Sakshi

విద్యుద్దీపాల వెలుగులో

కల్వకుర్తిలోని ఎంబీ చర్చి

సుక్రిస్తు రాకను స్వాగతిస్తూ క్రిస్మస్‌ స్టార్ల వెలుగులు.. విద్యుద్దీపాల కాంతుల్లో ప్రార్థనా మందిరాలు.. ప్రత్యేక అలంకరణలో పశువుల పాకలు.. వెరసి జిల్లాకు ఒకరోజు ముందే క్రిస్మస్‌ పండుగ వచ్చింది. ఆధ్యాత్మిక శోభతో చర్చీలు ఉట్టిపడుతున్నాయి. శాంతిదూతను స్వాగతిస్తూ కాంతి విరబూస్తోంది. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని చర్చీలు, నివాసాలను సర్వంగా సుందరంగా అలంకరించారు. ఆదివారం క్రైస్తవులు కుటుంబ సమేతంగా చర్చీలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సోమవారం నిర్వహించే పండుగకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

– కందనూలు

Advertisement

తప్పక చదవండి

Advertisement