ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదు

Published Fri, Mar 17 2023 2:02 AM

-

ఫ తప్పుడు సమాచారంతో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు యత్నం

మాడుగులపల్లి: రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌) ధ్రువీకరణ పత్రం పొందేందుకు యత్నించిన ప్రభుత్వ ఉద్యోగిపై గురువారం కేసు నమోదు చేసినట్లు మాడుగులపల్లి ఎస్‌ఐ కై గూరి నరేష్‌కుమార్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం గ్రామానికి చెందిన మునగాల చంద్రప్రకాష్‌రెడ్డి గత నెల 24వ తేదీన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం కోసం తన ఆదాయం రూ.8లక్షల లోపు ఉన్నట్లు తెలుపుతూ న్యాయవాదితో నోటరీ చేయించి తహసీల్దార్‌కు దరఖాస్తు సమర్పించాడు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన రెవెన్యూ అధికారులు చంద్రప్రకాష్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి అని, ఆదాయం, ఆస్తులు సైతం అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి తప్పుడు సమాచారంతో లబ్ధి పొందేందుకు యత్నించిన చంద్రప్రకాష్‌రెడ్డిపై తహసీల్దార్‌ అర్చన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్‌కుమార్‌ పేర్కొన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement