రుణం తీసుకోకున్నా తీసుకున్నట్లు నోటీసులు

3 Nov, 2023 07:30 IST|Sakshi
తెల్లబల్లి సహకార సంఘం ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేస్తున్న ధనలక్ష్మి

నడిగూడెం: రుణం తీసుకోకున్నా తీసుకున్నట్లు బ్యాంకు నుంచి నోటీసు వచ్చిందని, సంబంధిత అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం నడిగూడెం మండలం తెల్లబల్లి సహకార సంఘం ఎదుట మహిళ కుటుంబంతో సహా ఆందోళనకు దిగింది. తెల్లబల్లి గ్రామానికి చెందిన బాధితురాలు ధనలక్ష్మి భర్త కొల్లు గోవిందరాజులు మాట్లాడుతూ 2017 మార్చిలో తమ పేరిట అప్పటి సీఈఓ సంబంధిత కార్యాలయ సిబ్బందితో కుమ్మకై ్క రూ.60 వేలు రుణం తీసుకున్నారని ఆరోపించారు. దీంతో సంబంధిత బ్యాంకు అధికారులు రుణం డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని, తమను మొండి బకాయి రైతు జాబితాలో ప్రకటించారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

సహకార సంఘం ఎదుట కుటుంబ

సభ్యులతో కలిసి మహిళ ఆందోళన

మరిన్ని వార్తలు