గులాబీ గూటికి అమరేందర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

గులాబీ గూటికి అమరేందర్‌రెడ్డి

Published Sun, Nov 19 2023 2:02 AM

సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంపీ లింగయ్యయాదవ్‌, చిరుమర్తి  
 - Sakshi

మిర్యాలగూడ: టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మునివ్సపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు జొన్నలగడ్డ రంగారెడ్డి తదితరులు ఉన్నారు.

నేడు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ

మిర్యాలగూడ టౌన్‌: మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలోని ఐఎంఏ బిల్డింగ్‌లో ఆదివారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నట్టు ఆ వేదిక జాతీయ నాయకుడు డాక్టర్‌ మువ్వ రామారావు తెలిపారు. శనివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ సందర్భంగా ఉదయం 10:30గంటలకు జేవీవీ జెండాను ఆ వేదిక జాతీయ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ మహాసభకు డాక్టర్‌ రాంమోహన్‌రావు, ఢిల్లీ ప్రొఫెసర్‌ ఎన్‌.సుకుమార్‌, డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.కృష్ణ, డాక్టర్‌ మురళీధర్‌, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కొండల్‌రావు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌బాబు, డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, ఎండీ మీయా హజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జేవీవీ నాయకులు నర్రా రామారావు, కందుకూరి సుదర్శన్‌, బి.రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

రేపు నకిరేకల్‌కు

సీఎం కేసీఆర్‌

నకిరేకల్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న నకిరేకల్‌లో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. స్థానిక మూసీ రోడ్డులోని సువర్ణగార్డెన్‌ సమీపంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, బీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు.

రేపు అండర్‌–19

ఖోఖో పోటీలు

నల్లగొండ టూటౌన్‌: ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌–19 బాలబాలికల ఖోఖో పోటీలు సోమవారం నల్లగొండలోని మేకల అభినవ్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ (అండర్‌–19) కార్యదర్శి కె.ఇందిర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 20న ఉదయం 10గంటలకు బోనఫైడ్‌, 10వ తరగతి మెమోతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు కె.నర్సిరెడ్డి 9440072854 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

2.19లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

రామగిరి(నల్లగొండ): వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 31,980 మంది రైతుల నుంచి 2,19,032 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.313.40 కోట్లు చెల్లించామని డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం తిప్పర్తి మండలం కేశరాజుపల్లి, అనిశెట్టి దుప్పలపల్లిలో పీఏసీఎస్‌ ధాన్యం కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.

ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌ఓ , డీఎం
1/2

ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌ఓ , డీఎం

కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్న అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి
2/2

కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్న అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి

Advertisement
Advertisement