యాదాద్రీలో భక్తుల కోలాహలం | Sakshi
Sakshi News home page

యాదాద్రీలో భక్తుల కోలాహలం

Published Sun, Nov 19 2023 2:02 AM

యాదాద్రి ప్రధానాలయంలో వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు
 - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రీశుడి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ మండపంలో శనివారం ఒక్కరోజే 663 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. రూ.5,30,400 ఆదా యం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వ్రత పూజలతో శివకేశవుల సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇక కొండపైన భక్తులు కార్తీక దీపారాధన చేశారు.

నారసింహుడికి నిత్యారాధనలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున శ్రీస్వామి, అమ్మవారికి సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం ఆరాధన, నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. స్వామివారి నిత్యకల్యాణం, వేద ఆశీర్వచనంగావించారు. సాయంత్రం శ్రీస్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాఢవీధిలో ఊరేగించారు.

ఫ ఒకే రోజు వ్రతాలు ఆచరించిన 663 జంటలు

నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
1/1

నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

Advertisement
Advertisement