డిసెంబర్‌ 3వ వారంలో వైజ్ఞానిక ప్రదర్శన | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 3వ వారంలో వైజ్ఞానిక ప్రదర్శన

Published Mon, Nov 27 2023 1:46 AM

- - Sakshi

నల్లగొండ: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి హైదరాబాద్‌, జిల్లా విద్యా శాఖల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 3వ వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్‌ ఫెయిర్‌) నిర్వహించనున్నట్లు డీఈఓ బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. సమాజం కోసం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉప అంశాలుగా ఆరోగ్యం, జీవితం, పర్యావరణ శైలి, వ్యవసాయం, సమాచారం, రవాణ, కంప్యూటరైజేషన్‌ థింకింగ్‌లపై ప్రదర్శన పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని గణితం, సైన్స్‌ ఉపాధ్యాయులు సమన్వయంతో ప్రతి పాఠశాల నుంచి 3 ప్రాజెక్టులు తక్కువ కాకుండా విద్యార్థులు పాల్గొనేలా చూడాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి వనం లక్ష్మీపతి సెల్‌ : 9848578845 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

పోలింగ్‌ కేంద్రం సందర్శన

నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లిలోని మండల ప్రజా పరిషత్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఆదివారం కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు (జనరల్‌ అబ్జర్వర్‌) బాలసుబ్రహ్మణ్యం సందర్శించారు. కేంద్రంలో కల్పించిన వసతులు, ఇతర వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ పద్మ, కోనం శ్రీనివాస్‌, ఎంపీడీఓ యాదగిరి, ఎస్‌ఐ సైదాబాబు ఉన్నారు.

‘మత్స్యగిరి’ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల మత్స్యగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం పరిసమాప్తం అయ్యాయి. చివరిరోజు ద్వారతోరణం, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభారాధన, చతుస్నానార్చన, నిత్యహోమాలు, శ్రీ సుదర్శన నారసింహ ఇష్టి, పూర్ణాహుతి, బలిహరణం, నివేదన, తీర్థప్రసాద గోష్టి తదితర పూజలు నిర్వహించారు.నాయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈఓ గుత్తా మనోహర్‌రెడ్డి దంపతులు, మత్స్యగిరి ఆలయ ఈఓ మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

నారసింహుడికి నిత్యారాధనలు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు సుప్రఽభాతం సేవ, ఆరాధన, అనంతరం నిజాభిషేకం, అర్చన చేశారు. అలాగే ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.

వివరాలు తెలుసుకుంటున్న 
జనరల్‌ అబ్జర్వర్‌ బాలసుబ్రహ్మణ్యం
1/2

వివరాలు తెలుసుకుంటున్న జనరల్‌ అబ్జర్వర్‌ బాలసుబ్రహ్మణ్యం

 పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
2/2

పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

Advertisement
Advertisement