మద్యం షాపులు బంద్‌ | Sakshi
Sakshi News home page

మద్యం షాపులు బంద్‌

Published Wed, Nov 29 2023 2:24 AM

జ్యోతిబా పూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు   
 - Sakshi

నల్లగొండ క్రైం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్త వైన్‌ షాపులు, బార్లు బంద్‌ చేయడంతోపాటు మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసేంత వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని మద్యం వ్యాపారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు మద్యం అమ్మకాలు నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు.

30న కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవు

నల్లగొండ: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని కర్మాగారాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు జిల్లా ఉప కార్మిక కమిషనర్‌ ఎం.రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులంతా గురువారం తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

తైక్వాండో అసోసియేషన్‌ ఇన్‌చార్జ్‌ల నియామకం

నల్లగొండ టూటౌన్‌: తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌లుగా నాగిళ్ల రమేష్‌, చింత అనిల్‌కుమార్‌ను నియమిస్తూ తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వీరిద్దరికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను నియమించిన అసోసియేషన్‌ రాష్ట్ర బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ విద్యార్థులను తైక్వాండోలో రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు.

మహనీయుడు.. మహాత్మా జ్యోతిరావ్‌పూలే

మిర్యాలగూడ టౌన్‌: సమాజంలో సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావ్‌పూలే అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులుగౌడ్‌ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో ఆ సంఘం ఆధ్వర్యంలో 133వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సాగర్‌ రోడ్డులోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, మండల అధ్యక్షుడు నరేష్‌ ముదిరాజ్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామరాజు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

యాదాద్రీశుడికి

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయం, విష్ణు పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించి తమలపాకులతో ఆకు పూజ చేశారు. నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగింకి కోర్కెలు కోరుకున్నారు. ఆలయంలో వందలాది మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

నియామక పత్రం అందజేస్తున్న శ్రీహరి
1/2

నియామక పత్రం అందజేస్తున్న శ్రీహరి

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
2/2

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

Advertisement
Advertisement