పోలింగ్‌ సజావుగా కొనసాగాలి | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సజావుగా కొనసాగాలి

Published Wed, Nov 29 2023 2:24 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కర్ణన్‌ - Sakshi

సభలు, సమావేశాలు నిర్వహించొద్దు

అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున రాజకీయ పార్టీలు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ ఒక ప్రకటనలో కోరారు. పోలింగ్‌ రోజు వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా సంచరించవద్దని పేర్కొన్నారు. స్థానికేతరులు అంతా నియోజక వర్గాన్ని విడిచి వెళ్లాలని సూచించారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఒపీనియన్‌ పోల్స్‌ లేదా ఇతర పోల్స్‌ ఫలితాలను ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. ఎవరైనా మద్యం విక్రయాలు చేసినా, వాహనాల్లో ఓటర్లను తరలిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనపై సీ–విజిల్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే వంద నిమిషాల్లో పరిష్కరిస్తామని తెలిపారు.

నల్లగొండ: అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్‌ సజావుగా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల నోడల్‌ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ సామగ్రి తరలింపునకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు అవినాష్‌ చంపావత్‌, ఆర్‌.కన్నన్‌, కె.బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ అపూర్వరావు సమక్షంలో సిబ్బందికి పోలింగ్‌ స్టేషన్ల వారీగా విధులు కేటాయించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తిచేశామన్నారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, ఎన్‌ఐసీ అధికారి గణపతిరావు, ఏఓ మోతీలాల్‌, ఎలక్షన్‌ డిటి విజయ్‌ పాల్గొన్నారు.

కౌంటింగ్‌ ఏర్పాట్ల పరిశీలన

తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలోని గోదాంలో కౌటింగ్‌కేంద్రంలో ఏర్పాట్లను కలెక్టర్‌ కర్ణన్‌ పరిశీలించారు. ఆయనవెంట ట్రాన్స్‌కో ఎస్‌ఈ చంద్రమోహన్‌, సర్వేల్యాండ్స్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులు, పీఆర్‌ఈఈ తిరుపతయ్య, కమిషనర్‌ రమణాచారి, పరిశ్రమల జీఎం కోటేశ్వరరావు ఉన్నారు.

ఫ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ.కర్ణన్‌

Advertisement
Advertisement