8 నుంచి అర్వపల్లి ఉర్సు

2 Dec, 2023 01:26 IST|Sakshi

సిద్ధమవుతున్న దర్గా

అర్వపల్లి: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన అర్వపల్లి శివారులోని హజ్రత్‌ఖాజా నసీరుద్దీన్‌ బాబా ఉర్సు ఈ నెల 8 నుంచి మొదలు కానుంది. రెండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. 8న తొలిరోజు సందల్‌, ఉర్సు జరుగనుంది. ఈ సందర్భంగా తొలిరోజు సాయంత్రం 4 గంటలకు అర్వపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి గంధం ఉరేగింపు మొదలై రాత్రి 9 గంటలకు దర్గాకు చేరుతుంది. అదేరాత్రి ఖవాలీ కార్యక్రమం నిర్వహిస్తారు. 9వ తేదీ రెండో రోజు దీపారాధన (చిరాగ్‌) కార్యక్రమం నిర్వహించి దర్గాలో దీపాలను వెలిగిస్తారు. దీంతో ఉర్సు ముగుస్తుంది.

మరిన్ని వార్తలు