పోచంపల్లి వాసికి ‘బెస్ట్‌ హాం్యడ్లూమ్‌’ అవార్డు | Sakshi
Sakshi News home page

పోచంపల్లి వాసికి ‘బెస్ట్‌ హాం్యడ్లూమ్‌’ అవార్డు

Published Tue, Dec 5 2023 4:54 AM

 అవార్డుకు అందుకుంటున్న గంజి యుగేంధర్‌
 - Sakshi

భూదాన్‌పోచంపల్లి : సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ విక్రయాలు చేపడుతున్న భూదాన్‌పోచంపల్లికి చెందిన ఇక్కత్‌ వరల్డ్‌ అధినేత గంజి యుగేందర్‌ ఆసియా బెస్ట్‌ హ్యాండ్లూమ్‌ అవార్డు అందుకున్నారు. ఈ నెల 3న తమిళనాడులోని తిరుచిరావలిలో ఆసియా ఆవార్డు సంస్థ నిర్వహించిన బిజినెస్‌ అవార్డు వేడుకల్లో ఆయన అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారత్‌తో పాటు శ్రీలంక, భూటాన్‌, మలేషియా, నేపాల్‌, కెన్యా, మల్దీవులు, మారిషస్‌ దేశాల నుంచి వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంజి యుగేందర్‌ మాట్లాడుతూ అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. తన ఉన్నతికి, అవార్డు రావడానికి సహకరించిన చేనేత కళాకారులు, కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
Advertisement