సామాజిక సేవలో శ్రీ సాయిధామం | Sakshi
Sakshi News home page

సామాజిక సేవలో శ్రీ సాయిధామం

Published Tue, Dec 5 2023 4:54 AM

శ్రీ సాయిధామం ఆశ్రమ పాఠశాల - Sakshi

బొమ్మలరామారం: మండల పరిదిలోని పెద్ద పర్వతాపూర్‌ గ్రామంలో గల శ్రీ సాయిధామం ఆశ్రమ పాఠశాలలో కార్పొరేట్‌కు దీటుగా ప్రతి సంవత్సరం సుమారుగా 300 మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తూ చేయూతనిస్తోంది. ఈ పాఠశాలలో విద్యతో పాటు దేశభక్తి, దైవభక్తి, కుటుంబ విలువలు, యోగా, క్రీడలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుండడంతో మెరుగైన ఫలితాలు సాధిస్తుంది.

నెరవేరుతున్న ప్రభూజీ సంకల్పం..

శ్రీ సాయిధామం వ్యవస్థాపకుడు శ్రీ సత్యపదానంద ప్రభూజీ పేద పిల్లలకు విద్య భారం కాకూడదనే ఉద్ధేశంతో 1993లో ఉచిత ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పాఠశాల ప్రారంభమై 30 ఏళ్లు పూర్తవుతోంది. గత 25 ఏళ్లుగా ఈ పాఠశాల పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తుంది. 7 సంవత్సరాల క్రితం సత్యపదనంద ప్రభూజీ కాలం చేసినా ఆయన సంకల్పానికి అడ్డంకులు రాకుండా ప్రస్తుత ఆశ్రమ పీఠాధిపతి రామానంద ప్రభూజీ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ప్రభూజీ ఆశయాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు.

ఆశ్రమంలో కొనసాగుతున్న

సేవా కార్యక్రమాలు

సాయిధామం ఆశ్రమంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు యోగా సాధన, నేచురోపతి ఆరోగ్య కేంద్రం, నిత్యాన్నదానం, హిందూ పండుగలు, పర్వదినాలు, విశిష్ట రోజుల్లో యజ్ఞ హోమాదుల నిర్వహణ, గోసంరక్షణ కోసం గోశాల నిర్వహణ, అమవాస్య రోజున గోపూజ, బొమ్మలరామారం మండల పరిధిలోని గ్రామాలల్లో హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు, సాయి వాణి మాస పత్రిక నిర్వహణ జరుగుతుంది.

పేద విద్యార్థులకు ఉచిత

విద్యనందిస్తూ చేయూత

పేద పిల్లలకు భారం కావొద్దని..

పేద పిల్లలకు చదవు భారం కావొద్దనే ఆశ్రమ వ్యవస్ధాపకుడు సత్యపదానంద ప్రభూజీ ఆశయాన్ని కొనసాగిస్తున్నాం. చదువుతోనే మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆశ్రమ భక్తులు, శ్రేయోజిలాషుల సహకారంతో ఉచిత విద్యను అందిస్తున్నాం. దేశభక్తితో పాటు దైవభక్తిని విద్యార్థులకు నేర్పించి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. పేద విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నా.

– రామానంద ప్రభూజీ, ఆశ్రమ పీఠాధిపతి

పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు
1/2

పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు

2/2

Advertisement
Advertisement