చురుగ్గా మోడ్రన్‌ ధోబీఘాట్‌ పనులు | Sakshi
Sakshi News home page

చురుగ్గా మోడ్రన్‌ ధోబీఘాట్‌ పనులు

Published Thu, Dec 7 2023 2:24 AM

నిర్మాణంలో ఉన్న మోడ్రన్‌  ధోబీఘాట్‌ - Sakshi

మోత్కూరు : పట్టణంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలో బిక్కేరు చెంతన రూ.2 కోట్లతో నిర్మిస్తున్న మోడ్రన్‌ ధోబీఘాట్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం అప్పటి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ నిధులు మంజూరు చేయించి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో ధోబీఘాట్‌ నిర్మాణం చేపట్టారు. స్లాబ్‌ దశలో పనులు ఉన్నాయి. వీటిలో రూ.45 లక్షలు యంత్రాలకు వినియోగించనున్నారు. మరో 3 నెలల్లో ధోబీ ఘాట్‌ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు పేర్కొంటున్నారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 రజక కుటుంబాలు కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రధాన రోడ్డు వెంటతో పాటు ల్యాండ్రీ దుకాణాలు నిర్వహిస్తుండటంతో పాటు తమ స్వంత నివాస గృహాల్లో కూడా షాపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అప్పటి ప్రభుత్వం ల్యాండ్రీ దుకాణం వారికి 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ అందిస్తుంది. మోడ్రన్‌ దోబీ ఘాట్‌ నిర్మాణం పూర్తి కాగానే పెద్ద షెడ్డు నిర్మిస్తారు. అనంతరం యంత్రాలను అమరుస్తారు. ఆధునాతన విధానంలో బట్టలు ఉతికే యంత్రాలు, ఉతికిన వాటిని ఆరబెట్టే యంత్రాలు తరువాత ఇసీ్త్ర చేసి పెట్టే యంత్రాలను ప్రభుత్వమే సమకూర్చనున్నది. గంటకు 200 దుస్తులు ఉతికి ఇసీ్త్ర చేసే యంత్రాలను రూపొందించారు.

రూ.2 కోట్లతో నిర్మాణం

అధునాతన యంత్రాలతో ఏర్పాటు

మూడు నెలల్లో పూర్తి

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మోడ్రన్‌ ధోబీ ఘాట్‌ను రూ.2 కోట్లతో నిర్మిస్తున్నాం. ఇప్పటికీ 75 శాతం పనులు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో ధోబీఘాట్‌ అందుబాటులోకి రానుంది. పూర్తి స్థాయి మిషనరీ వస్తుంది. జకులకు ధోబీఘాట్‌ ఎంతో ఉపయోగ పడుతుంది.

– శ్రీకాంత్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, మోత్కూరు

సంతోషంగా ఉంది

ప్రభుత్వం ఆధునిక ధో బీఘాట్‌ నిర్మిస్తున్నది. మా రజక వృత్తిదారులకు చాలా సంతోషంగా ఉంది. మోడరన్‌ ధోబీ ఘాట్‌ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించిన అప్పటి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌కు కృతజ్ఞతలు. మా వృత్తిలో కూడ ఇబ్బందులు తప్పనున్నాయి.

– కూసంపల్లి సోమనర్సయ్య, మోత్కూరు

1/2

2/2

Advertisement
Advertisement