జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక | Sakshi
Sakshi News home page

జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక

Published Fri, Dec 8 2023 7:24 AM

అవార్డు అందుకుంటున్న భూక్యా బీచ్చు - Sakshi

గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో వినూత్నంగా పంటలు సాగు చేస్తూ జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపికయ్యాడు ఓ రైతు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన రైతు భూక్య బీచ్చు వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నందుకుగాను ఈనెల 6న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్‌ కృషి జాగరణ్‌ మేళాలో జాతీయ ఉత్తమ మిలియనీర్‌ రైతు అవార్డు వరించినట్లు కేవీకే ఇన్‌చార్జ్‌ ప్రోగ్రాం కోఆర్డి నేటర్‌ నరేష్‌ గురువారం తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కృషి జాగరణ్‌ సంయుక్తంగా ప్రతి సంవత్సరం మిలీనియం ఫార్మర్స్‌ మీట్‌ నిర్వహించి ఉత్తమ రైతులకు అవార్డులను అందజేస్తుంది. అందులో భాగంగా మిలీనియం ఫార్మర్స్‌ మీట్‌ – 2023 పేరిట ఈనెల 6నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో జాతీయ మేళా నిర్వహించారు. ఈ మీట్‌లో తెలంగాణ నుంచి నలుగురు రైతులు అవార్డుకు ఎంపికయ్యారు. అందులో గడ్డిపల్లి కేవీకేకి చెందిన రైతు భూక్యా బీచ్చు ఒకరు. ఈ అవార్డు రావడం పట్ల గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సెక్రటరీ స్నేహలత, డైరెక్టర్స్‌, శాస్త్రవేత్తలు, సిబ్బంది తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement