దరఖాస్తు చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకోవాలి

Published Thu, Dec 14 2023 2:16 AM

-

భువనగిరి టౌన్‌: 2024– 25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో 6 వ తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశానికై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటన వెలువరించిందని కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతిలో బాలబాలికల ప్రవేశానికి 2024 మార్చి 31వరకు 10 నుంచి 12 సంవత్సరాల వయసు ఉండి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. 9వ తరగతిలో బాలబాలికల ప్రవేశానికి 2024 మార్చి 31వరకు 13 నుంచి 15 సంవత్సరాల వయసు ఉండి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. జనరల్‌, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌, రక్షణ దళాల్లో పనిచేసే వారు, ఓబీసీ విద్యార్థుల ప్రవేశ పరీక్ష ఫీజు రూ.650, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.500 నిర్ణయించారని పేర్కొన్నా రు. exams.nta.in వెబ్‌సైట్‌ద్వారా దరఖాస్తు సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 16 సాయంత్రం 5గంటల వరకు ఉంటుందని, అలాగే ఈనెల 16 రాత్రి 11.50గంటలకు వరకు ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని తెలిపారు. ప్రవేశపరీక్ష వచ్చే ఏడాది జనవరి 21 ఓఎంఆర్‌ పద్ధతిలో ఉంటుందని, వివరాలకు nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Advertisement
Advertisement