ఎమ్మెల్యే ఐలయ్య విజయోత్సవ సభలో దొంగల చేతివాటం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఐలయ్య విజయోత్సవ సభలో దొంగల చేతివాటం

Published Wed, Dec 20 2023 1:26 AM

మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది, స్థానికులు  - Sakshi

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య విజయోత్సవ సభలో దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. పల్లెపహాడ్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఎగ్గిరి యాదగిరి వద్ద రూ.23వేలు, మోదుబావిగూడేనికి చెందిన కోల రాములు వద్ద రూ.56వేలు, పోతిరెడ్డిపల్లికి చెందిన నాగుల ఆనంద్‌యాదవ్‌ వద్ద రూ.5వేలను జేబు దొంగలు అపహరించుకుపోయారు.

విద్యుత్‌ తీగలు తగిలి

గడ్డి లోడు దగ్ధం

కోదాడరూరల్‌: మండల పరిధిలోని మంగళితండాలో గడ్డి లోడుకు విద్యుత్‌ తీగలు దగ్ధమైంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామానికి చెందిన తేజావత్‌ నాగు కోదాడ మండలంలోని మంగళితండాకు చెందిన ఓ రైతు వద్ద 100 మోపుల గడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్‌పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని ఆలయ సమీపంలో విద్యుత్‌ తీగలు కిందకు ఉండటంతో గడ్డి లోడుకు తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఫైర్‌స్టేషన్‌ సమాచారం అందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైరింజన్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి ట్రాక్టర్‌ కాలిబూడిద కాకుండా కాపాడారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

డిండి: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రానికి చెందిన చింతపల్లి ప్రసాద్‌(23)కు ఏడాది క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రసాద్‌ భార్య గత కొన్నినెలలుగా తన తల్లిగారి ఇంటి వద్దనే ఉంటోంది. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రావడం లేదని, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ప్రసాద్‌ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఈదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన యాదాద్రి ఆలయ ఈఓ

యాదగిరిగుట్ట: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ గీతారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రీశుడి చిత్రపటం, లడ్డూ ప్రసాదంను మంత్రికి అందజేశారు. యాదాద్రి ఆలయాన్ని సందర్శించాలని మంత్రి కొండా సురేఖను ఈఓ కోరారు.

మంత్రి కొండా సురేఖకు స్వామివారి 
చిత్రపటాన్ని అందజేస్తున్న ఈఓ గీతారెడ్డి
1/2

మంత్రి కొండా సురేఖకు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఈఓ గీతారెడ్డి

ప్రసాద్‌ (ఫైల్‌)
2/2

ప్రసాద్‌ (ఫైల్‌)

Advertisement
Advertisement