ఆలయం వద్ద బహిరంగ వేలం పాటలు | Sakshi
Sakshi News home page

ఆలయం వద్ద బహిరంగ వేలం పాటలు

Published Wed, Dec 20 2023 1:26 AM

వేలం పాటలో మాట్లాడుతున్న 
చైర్మన్‌ అలుగుబెల్లి నర్సింహారెడ్డి
 - Sakshi

కనగల్‌ : భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద వివిధ వస్తువుల విక్రయ హక్కులు కల్పించేందుకు మంగళవారం బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. సంవత్సరం కాలానికి కొబ్బరికాయలు అమ్మే హక్కులకు గాను రూ.82,50,000లకు తిరుమలగిరి గ్రామనికి చెందిన వంగూరి సోమయ్య, పూలు పండ్లు అమ్ముకొను హక్కులకు గాను రూ.10,50,000లకు పాలకుర్తికి చెందిన విజయ్‌కుమార్‌ దక్కించుకున్నారు. కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎం.వెంకటలక్ష్మి, చైర్మన్‌ అలుగుబెల్లి నరసింహారెడ్డి, సర్పంచ్‌ అంజమ్మరామచంద్రం, మాజీ చైర్మన్లు దేప కరుణాకర్‌రెడ్డి, ముత్తయ్య, యాదగిరి దేవాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ జె.చంద్రయ్య, సిహెచ్‌.లింగయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉపేందర్‌రెడి, ఎం.ఆంజనేయులు, జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement