అంతా 25 ఏళ్లలోపు వారే.. డబ్బుల డిమాండ్‌.. కుదిరితే లైంగికదాడి

3 Feb, 2024 13:39 IST|Sakshi

నల్లగొండ క్రైం: ప్రేమజంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ సైకో గ్యాంగ్‌ సెల్‌ఫోన్‌లో రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీడియోలు చూపించి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు, యువతులపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. నల్లగొండ పట్టణంలోని నార్కట్‌పల్లి – అద్దంకి ప్రధాన రహదారి పానగల్‌ బైపాస్‌ సమీపంలోని నంద్యాల నరసింహారెడ్డి కాలనీ వద్ద ఈ గ్యాంగ్‌ వ్యవహారం బయటపడింది. వీరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

నల్లగొండ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. నల్లగొండ పట్ట ణానికి చెందిన కొందరు ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం ఉన్న వారు చెట్లపొదల మధ్య సన్ని హితంగా ఉండడాన్ని పసిగట్టి సెల్‌ఫోన్‌లో రహస్యంగా వీడియో తీసి ఆయా జంటలను బ్లాక్‌ మెయిల్‌ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్తే మీ ఇంట్లో వాళ్లకు ఈ వీడియోలు పంపుతామని, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇస్తేనే వీడియోలను డిలీట్‌ చేస్తామని వారికి ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. దీంతో పరువు పోతుందని, వివాహేతర సంబంధం బయట పడుతుందనే ఉద్దేశంతో ఈ విషయాలను బాధితులు ఎవరికీ చెప్పడం లేదు. గత మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వెలుగులోకి ఇలా..
ఓ యువకుడు తన ప్రియురాలిని తీసుకొని నంధ్యాల నరసింహారెడ్డి కాలనీ సమీపంలోని నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో గ్యాంగ్‌లోని యువకులు యువతిని బలవంతంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు. అదే సమయంలో వివాహేతర సంబంధం కలిగిన మరో జంట పై ఇదే తరహాలో దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది.

దోపిడీ చేసిన నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. అనేక మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా తెలుస్తోంది. ఈ విషయంపై నల్లగొండ టూటౌన్‌ ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం గాలిస్తున్నట్లు తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు