రెండో విడత నాడు–నేడుకు నిధులు విడుదల | Sakshi
Sakshi News home page

రెండో విడత నాడు–నేడుకు నిధులు విడుదల

Published Tue, Mar 21 2023 1:18 AM

-

కర్నూలు సిటీ: జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల రూపు రేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు రెండో విడత కింద చేపట్టిన పనులకు రూ.39.92 కోట్ల బిల్లులు మంజూరైనట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.వేణుగోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడత కింద 825 పాఠశాలలు, 60 అంగన్‌వాడీకేంద్రాలు, 23 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాడు–నేడు కింద పనులు చేపట్టామన్నారు. ఈ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్వహించిన పనులకు సంబంధించిన బిల్లులు ఆయా స్కూళ్ల పేరెంట్స్‌ కమిటీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నా రు. స్కూళ్లలో జరిగిన పనులకు రూ.36.59 కోట్లు, అంగన్‌వాడీల్లోని పనులకు రూ.కోటి, జూనియర్‌ కాలేజీలలో చేసిన పనులకు రూ.2.33 కోట్లు మంజూరయ్యాయన్నారు. మిగిలిన స్కూళ్లలో జరుగుతున్న పనులకు సంబంధించి ఇసుక, సిమెంటు పర్యవేక్షణకు సమగ్ర శిక్ష కార్యాలయంలో ప్రత్యేకంగా రాజారావు (9550544197)ను నియమించామన్నారు.

రూ.39.92 కోట్లు పేరెంట్స్‌ కమిటీ ఖాతాల్లో జమ

Advertisement
Advertisement