మహానంది మరింత అభివృద్ధి | Sakshi
Sakshi News home page

మహానంది మరింత అభివృద్ధి

Published Thu, Mar 23 2023 1:10 AM

-

మహానంది: మహానంది క్షేత్ర నక్షత్రం మఖ నక్షత్రమని, ఆదాయం రూ.14, వ్యయం రూ. 2గా ఉన్నందున శోభకృత్‌ నామ సంవత్సరంలో మహానందీశ్వరుడి ఆదాయం పెరగడంతో పాటు ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని మహానంది దేవస్థానం వేదపండితుడు రవిశంకర అవధాని తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా మహానందిలో బుధవారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కొమ్మా పాలమహేశ్వరరెడ్డి, ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాంగ పూజ నిర్వహించారు. అనంతరం పంచాంగ పఠనంలో రవిశంకర అవధాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గత సమస్యలన్నీ పరిష్కారమై రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో కళకళలాడుతాయన్నారు. కార్యక్రమంలో ఏఈఓ వై.మధు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గంగిశెట్టి మల్లికార్జునరావు, వీరభద్రుడు, ఆర్చకులు, పండితులు పాల్గొన్నారు.

పంచాంగ పఠనంలో వేదపండితుడు రవిశంకర అవధాని

Advertisement
Advertisement