శాసీ్త్రయంగా గొర్రెలు, మేకల పెంపకం | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయంగా గొర్రెలు, మేకల పెంపకం

Published Thu, Sep 28 2023 1:42 AM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): శాసీ్త్రయ పద్ధతులతో గొర్రెల పెంపకాన్ని చేపడితే లాభసాటిగా ఉంటుందని జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్‌ నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో కర్నూలు, నంద్యాల జిల్లాల గొర్రెల పెంపకందారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు. గొర్రెల పెంపకంలో తగిన అవగాహన లేకపోవడంతోనే పెంపకందారులు నష్టపోతున్నారన్నారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డీడీ రాజశేఖర్‌ మాట్లాడుతూ గొర్రెల పెంపకంలో విత్తన పొట్టేళ్లు కీలకమైనవని, విత్తనపు పొట్టేళ్ల జాతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నెల్లూరు బ్రౌన్‌, జొడిపి జాతులతో గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల జాతులను కూడా వినియోగించవచ్చన్నారు. గొర్రెలు, మేకలు అభివృద్ధి చెందాలంటే కాయ, గింజ జాతి పశు గ్రాసాలు ఇవ్వాలని, పోషక విలువలు కలిగిన దాణా ఇవ్వాలని సూచించారు. బహుళార్ధ పశువైద్య శాల డీడీ హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ నట్టల నివారణ మందులు తాపడం వల్ల గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా పెరుగుతాయన్నారు.జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ రవిబాబు, ప్యాపిలి గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం ఏడీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement