వైభవంగా అహోబిల దాస కార్యక్రమం | Sakshi
Sakshi News home page

వైభవంగా అహోబిల దాస కార్యక్రమం

Published Thu, Nov 9 2023 1:14 AM

బాచేపల్లెలో సుదర్శన హోమం నిర్వహిస్తున్న అహోబిలం ప్రధానార్చకులు   - Sakshi

ఆళ్లగడ్డ: మండలంలోని బాచేపల్లె గ్రామంలో అహోబిల దాస కార్యక్రమాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించారు. హిందూ ధర్మం, శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారంలో భాగంగా అహోబిలం మఠం 46వ పీఠాధిపతి పర్యవేక్షణలో అహోబిల దాస కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో ఉత్సవ మూర్తులు లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను కొలువుంచి పుణ్యాహవాచనం చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
Advertisement