నెలాఖరు వరకు కేసీకి నీరు | Sakshi
Sakshi News home page

నెలాఖరు వరకు కేసీకి నీరు

Published Sat, Nov 11 2023 2:04 AM

నిండుగా ప్రవహిస్తున్న కేసీ కాల్వ   
 - Sakshi

● రైతులు ఆందోళన చెందవద్దు ● కేసీ కెనాల్‌ ఈఈ, ఏఈ

జూపాడుబంగ్లా/ఆళ్లగడ్డ: కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం ఉన్న నీటిని వారబందీ ప్రకారం ఈ నెలాఖరి వరకు అందించనున్నట్లు ఈఈ తిరుమలేశ్వర్‌రెడ్డి, ఏఈ నరేష్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో సుంకేసులకు ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. సుంకేసుల నుంచి 2,200, ముచ్చుమర్రి నుంచి 700 క్యూసెక్కుల చొప్పున కేసీ కాల్వకు నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రైతుల వినియోగార్థం లాకిన్స్‌లా వరకు చేరుతున్న నీటిని నిప్పులవాగుకు 1,700, తూడిచెర్ల సబ్‌చానల్‌కు 600, ఏబీఆర్‌ కాల్వకు 20 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నామన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే డిసెంబర్‌, జనవరి వరకూ కూడా నీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని, రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డీఎడ్‌ నాలుగో సెమిష్టర్‌ పరీక్ష ఫలితాల విడుదల

కర్నూలు (న్యూటౌన్‌): డీఎడ్‌ నాలుగో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి వి రంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలను సెప్టెంబర్‌ 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించామని, 2021–23 రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు ఫెయిల్‌ అయిన వారు హాజరయ్యారని తెలిపారు. మొత్తం1,608 మంది హాజరు కాగా 1,548 మంది (96.26 శాతం) ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. డమ్మీ మార్కుల జాబితాలను www. bse. ap. gov. in నుంచి పొందవచ్చని తెలిపారు. రీకౌంటింగ్‌కు ఒక సబ్జెక్టుకు రూ.500 చలానాను ఏపీసీఎఫ్‌ఎంఎస్‌ విధానం ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు.

Advertisement
Advertisement