ఎస్టీల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి | Sakshi
Sakshi News home page

ఎస్టీల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి

Published Mon, Nov 20 2023 2:04 AM

బుచ్చమ్మతోపు గ్రామం వద్ద సమస్యలు 
తెలుసుకుంటున్న  వీర గౌరి శంకరరావు  
 - Sakshi

మహానంది/శిరివెళ్ల/పాణ్యం: ఎస్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీవీజీ శంకరరావు, కమిషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌నాయక్‌ తెలిపారు. మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని బుచ్చమ్మతోపు గ్రామంలో ఆదివారం వారు పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలైన ఎస్టీల అభ్యున్నతికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నవారి భూములకు పట్టాలు అందించి, ప్రభుత్వ పథకాలు వర్తింపజేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. శిరివెళ్ల మండలం మహదేవపురంలో ఆయన పర్యటించారు. గ్రామంలోని ఎస్టీ కాలనీకి వెళ్లివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాణ్యం మండలంలో పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. పాణ్యం గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గిరిజన విద్యాలయాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సుగాలిమెట్టలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు హద్దులు చూపించేందుకు అధికారులకు ప్రతిపాదిస్తామన్నారు.

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌

వీర గౌరి శంకరరావు

Advertisement
Advertisement