కార్తీకం.. దీప శోభితం | Sakshi
Sakshi News home page

కార్తీకం.. దీప శోభితం

Published Mon, Nov 20 2023 2:04 AM

-

శ్రీశైలంటెంపుల్‌: ఇల కై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంకార్తీక వెలుగులతో శోభిల్లుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని ధ్వజ స్తంభంపై ఆకాశదీపాన్ని వెలిగించారు. ఈ దీపాన్ని వెలిగించినా, చూసినా సకల పాపా లు నశించి అనంత పుణ్యం లభిస్తుందని, వ్యాధులు తొలగి ఆయురారోగ్యాలు చేకూరతాయని పండితులు చెప్పారు. ఆలయ గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీధిలో కార్తీకదీపారాధన చేసుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజాదికాలను నిర్వహించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో లక్షవత్తులు, వెయ్యి వత్తులు, శివలింగాకార దీపాలు, ఓం నమఃశివాయ ఆకారంలో దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకున్నారు. కళా వేదికపై కళాకారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి

Advertisement
Advertisement