సంక్షేమ బావుటా | Sakshi
Sakshi News home page

సంక్షేమ బావుటా

Published Fri, Nov 24 2023 1:48 AM

- - Sakshi

ఎంతో మేలు జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. రైతు భరోసా పథకం ద్వారా ఐదో విడతల్లో ఇప్పటి వరకు రూ. 65,500 వచ్చింది. వైఎస్సార్‌ చేయూత పథకం కింద మూడు విడతల్లో 56,250, అమ్మఒడి పథకం ద్వారా నాలుగు విడతల్లో రూ. 55 వేలు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ(రైతులకు సంబంధించి) రూ. 12వేలు, వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా రూ. 16వేలు చొప్పున నగదు జమ అయ్యింది. నాలుగున్నర సంవత్సరాల్లో మా కుటుంబానికి రూ. 2 లక్షల మేర లబ్ధి చేకూరింది. రూ. 55వేలతో గేదెను కొనుగోలు చేసి చిన్నపాటి పాడిపరిశ్రమ నిర్వహించుకుంటు న్నాం. పెద్దకుమారుడు మధు ఎమ్మెసీ పూర్తి చేసి ఆత్మకూరు పట్టణంలో ఓ ఫెర్టిసైడ్స్‌ దుకాణంలో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. చిన్నకుమారుడు మనోజ్‌ ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ ఏపీ రెసిడెన్సియల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

– తిరుపతయ్య, వల్లంపాడు గ్రామం,

కోవెలకుంట్ల మండలం

సొంతింటి కల నెరవేరుతోంది

జగనన్న సీఎం అయితే పేదలకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. అనుకున్నట్టే జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు కూడా మంజూరు చేసి సొంతింటి కలను నెరవేరుస్తున్నారు. మాది పేద కుటుంబం. నా భర్త దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. నేను కూలి పనులు చేస్తున్నా. మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. గతంలో ఇంటి మంజూరు కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వలంటీర్‌ ఇంటి దగ్గరికి వచ్చి వివరాలు తీసుకున్నారు. మాకు ఇల్లు మంజూరు చేయించారు. ఇప్పుడు మేం ఇల్లు కట్టుకుంటున్నాం. పనులు పూర్తి కావచ్చాయి. సొంతింటి కల నేరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కలను నేరవేరుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. – రాధ, సంజామల

1/2

2/2

Advertisement
Advertisement