అన్ని వర్గాల వారికి సముచిత స్థానం | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల వారికి సముచిత స్థానం

Published Sat, Nov 25 2023 1:50 AM

-

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజికంగా, అర్ధికంగా ఎంతో అభివృద్ధి చేశారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించారు. అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. శ్రీశైలం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి.

– ఇసాక్‌బాషా, ఎమ్మెల్సీ

పారదర్శక పాలన

దొంగ రాజకీయాలు మినహా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిందేమీ లేదు. మహిళలను, బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఆయన అవమానించారు. టీడీపీ హయాంలో అన్నీ స్కాములే. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరింత సంక్షేమానికి, అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలిపించుకుదాం.

– పోతుల సునీత, ఎమ్మెల్సీ

అర్హతే ప్రామాణికం

రాష్ట్రంలో టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? మన రాష్ట్రంలో ఇళ్లులేని, అడ్రస్‌ లేని నాయకులు వాళ్లు. కరోనా సమయంలో ప్రజలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉన్నారు. వలంటీర్లను, ఆశావర్కర్లను, ఎమ్మెల్యేలను పంపి ప్రజల ప్రాణాలను కాపాడారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీని ఆదరించి, గెలిపిలంచాలి.

–హఫీజ్‌ఖాన్‌, కర్నూలు ఎమ్మెల్యే

విజయాన్ని ఎవరూ ఆపలేరు

జన సమూహాన్ని చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎమ్మెల్యే శిల్పాచక్రాణిరెడ్డికి ఉన్న ఆదరణ కనిపిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలను ఎంత దోచుకున్నాయో ఈ జనాన్ని చేస్తే అర్థమవుతోంది. శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయాన్ని ఎవరూ ఆపలేరు.

– ఆర్థర్‌, నందికొట్కూరు ఎమ్మెల్యే

హామీలన్నీ నెరవేర్చారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీలన్నీ నెరవేర్చారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలారు. అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా గడప వద్దకే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలి.

– బుట్టా రేణుక, కర్నూలు మాజీ ఎంపీ

Advertisement

తప్పక చదవండి

Advertisement