సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Mon, Nov 27 2023 1:56 AM

- - Sakshi

అధికారులు సమన్వయంతో

పనిచేయాలి

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్‌తో కలిసి

అవుకు టన్నెల్‌ పరిసర ప్రాంతాల

పరిశీలన

అవుకు: అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేసేందుకు ఈనెల 30న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్టుపల్లె గ్రామ సమీపంలో జరుగుతున్న పర్యటన ఏర్పాట్లను ఆదివారం ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌, ఎస్పీ రఘువీర్‌ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. టన్నెల్‌ సమీపంలో ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించి, లోతట్టు ప్రాంతం వైపు ప్రజలు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆ రోజు రెండు టన్నెళ్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారన్నారు. తర్వాత టన్నెల్‌కు 600 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటన విజయవంతానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఆర్డీఓ వెంకటరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ సంపత్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ చెంగయ్య, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు చల్లా విఘ్నేశ్వర్‌ రెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్‌ రెడ్డి, కాటసాని తిరుపాల్‌ రెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement