ఆరోగ్య శ్రీ లేక పోతే అప్పుల పాలే | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శ్రీ లేక పోతే అప్పుల పాలే

Published Mon, Nov 27 2023 1:56 AM

- - Sakshi

మాది చాలా పేద కుటుంబం. సెంటు భూమి లేదు. రెక్కల కష్టం మీదనే బతుకుతున్నాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భార్య కూడా ప్రతి రోజు కూలి పనికి వెళ్తుంది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో నాకు గుండెపోటు వచ్చింది. నందికొట్కూరు, కర్నూలులో చూపించుకున్నాను. నొప్పి భరించలేక నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. కర్నూలువిశ్వభారతి హాస్పిటల్‌లో చూపించుకున్నాను. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా యాంజియోగ్రామ్‌ చేశారు. రక్త నాళాలు పూడిపోయాయని గుర్తించి స్టంట్‌ వేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా చేయడం వల్ల నాకు ఖర్చేమి కాలేదు. హాస్పిటల్‌లో 3 నెలల మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ లేకపోతే కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక అప్పులపాలు అవ్వాల్సిందే. మా రెండవ అబ్బాయి కిరణ్‌ 10వ తరగతి చదువుచున్నాడు. అమ్మ ఒడి పథకం డబ్బులు నా భార్య లలితమ్మ బ్యాంకు అకౌంట్‌లో పడ్డాయి. పావలా వడ్డీ కూడా వర్తించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నా కుటుంబం అంతా రుణపడి ఉంది. పేదల పాలిట పెన్నిధిలా అందరిని ఆదుకుంటున్నారు ఆ మహానుబావుడు వైఎస్‌ జగన్‌.

– సుగదాసు ఏసేపు, తుమ్మలూరు,

పాములపాడు మండలం

Advertisement
Advertisement