టోల్‌గేట్‌ కనిపించగానే భారంగా భావిస్తాం | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్‌ కనిపించగానే భారంగా భావిస్తాం

Published Sat, Dec 23 2023 5:02 AM

- - Sakshi

టోల్‌గేట్‌ కనిపించగానే భారంగా భావిస్తాం.

ఏంటిది, ఈ డబ్బు వసూళ్లు ఎందుకు? అనే అనుమానం కలుగుతుంది. అప్పటి వరకు వెడల్పాటి రహదారులపై సాఫీగా సాగిన ప్రయాణాన్ని మరిచి విమర్శలు గుప్పించడం పరిపాటి. ఏం చేశారని ఇంత డబ్బు గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యక్తులు కోకొల్లలు. అయితే రహదారిని ప్రమాద రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ వసూళ్లు అనే విషయం చాలా మందికి తెలియని అంశం. అంతేకాదు.. టోల్‌ప్లాజా పరిధిలో ప్రయాణికులకు తెలియని ఎన్నో సేవలు అందుబాటులో ఉంటున్నాయి. మనకు తెలియకుండానే ఈ ప్రాంతం వాహన చోదకులకు తోడుగా నిలుస్తోంది. టోల్‌ప్లాజా పరిధిలో కిలోమీటర్ల మేర ప్రయాణం సాఫీగా సాగేందుకు ఎంతో దోహదపడుతోంది. ఎప్పుడు ఎలాంటి ఆపద కలిగినా మేమున్నామంటూ ముందుకొస్తోంది. ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే చాలు.. ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. – సాక్షి, కర్నూలు డెస్క్‌

నన్నూరు టోల్‌ప్లాజా సముదాయం

నేషనల్‌ హైవే 40 పరిధి

కర్నూలు నుంచి కడప వరకు 188 కిలోమీటర్లు

రహదారిలోని టోల్‌ గేట్లు

నన్నూరు, చాపిరేవుల,

చాగలమర్రి, పాటిమీదపల్లి

1/3

2/3

3/3

Advertisement
Advertisement