ఒడిదుడుకులు అధిగమించి.. | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకులు అధిగమించి..

Published Sat, Dec 23 2023 5:02 AM

నబిల్లా కరిష్మా  
 - Sakshi

ఎమ్మిగనూరుటౌన్‌: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నబిల్లా కరిష్మా అనే యువతి కష్టపడి చదివి ఎస్‌ఐ కొలువు సాధించారు. ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన ఎన్‌.రఫీక్‌, ఎన్‌ జరినా దంపతుల నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె నబిల్లా కరిష్మా నవోదయలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితితో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఒడిదుడుకులను అధిగమించి ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ఈ యువతిని బంధువులు, కాలనీవాసులు అభినందించారు.

విజయ ‘కీర్తన’

వెలుగోడు: మిడుతూరు స్టేషన్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగకీర్తన ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు. వెలుగోడు మండలం గుంతకందాల గ్రామానికి చెందిన మేడమ్‌ వెంకటేశ్వర్లు, సరోజా దంపతులకు ఒక కూతురు, కుమారుడు సంతానం. డిగ్రీ వరకు చదువుకున్న వెంకటేశ్వర్లు తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానని మధన పడేవాడు. ఈ క్రమంలో పిల్లలను బాగా చదివించాడు. కూతురు నాగ కీర్తన 2019లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు.

నాగకీర్తన
1/1

నాగకీర్తన

Advertisement
Advertisement