20 నిమిషాల వ్యవధిలోనే .. | Sakshi
Sakshi News home page

20 నిమిషాల వ్యవధిలోనే ..

Published Sat, Dec 23 2023 5:02 AM

కోవెలకుంట్ల రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 
రిజిస్ట్రేషన్లు జరుగుతున్న దృశ్యం - Sakshi

క్రయ, విక్రయదారులు ఆస్తి వివరాలు, పేరు, ఆధార్‌వంటి సమాచారాన్ని ఆనమోదు చేస్తే వెంటనే ఆస్తికి సంబంధించిన మార్కెట్‌ విలువ, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలు ఎంత కట్టాలో స్క్రీన్‌పై కనిపిస్తోంది. ఆ సొమ్మును ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కాని స్టాక్‌ హోల్డింగ్‌ ద్వారా చలానా కట్టవచ్చు. అనంతరం రిజిస్ట్రేషన్‌ టైమ్‌, శ్లాబ్‌ బుక్‌ చేసుకుని ఆ సమయానికి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లను సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగిస్తారు. ఇందుకోసం కేవలం 20 నిమిషాలు సమయం పడుతుంది. పాత విధానంలో రోజంతా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. కొత్త విధానంతో కేవలం అర గంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతండటంతో క్రయ, విక్రయ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement