పెంచిన సిలిండర్‌ ధర వెంటనే తగ్గించాలి | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2023 10:24 AM

కోటకొండలో ధర్నా చేస్తున్న నాయకులు, మహిళలు - Sakshi

నారాయణపేట రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ ధరను వెంటనే తగ్గించాలని పీఓడబ్ల్యూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ఈ మేరకు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా గ్రామంలోని భగత్‌సింగ్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సౌజన్య మాట్లాడారు. సిలిండర్‌ ధరను విచ్చలవిడిగా పెంచుతూ పోతే ప్రజలు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ఉజ్వల యోజన కింద ఉన్న కొద్ది మందికి మాత్రమే రూ.200 సబ్సిడీ ఇస్తున్నారని, అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా సవరించడంలేదని అన్నారు. కమర్షియల్‌ సిలిండర్‌ల ధరలు సవరించి డొమెస్టిక్‌ వాటిని విస్మరించడం సరికాదన్నారు. వెంటనే సిలిండర్‌ ధరలు తగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్‌ నాయకులు సలీం, సరళ, లక్ష్మి, నాగమణి, పద్మమ్మ, సురేఖ, ఇస్మాయిల్‌, అశోక్‌, రాంచందర్‌, కృష్ణ, మల్లేష్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement