డిజిటల్‌ ‘కీ’ సైతం.. | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ‘కీ’ సైతం..

Published Tue, Apr 18 2023 12:36 AM

-

ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు దాదాపుగా డిజిటల్‌ పద్ధతిలోనే జరుగుతున్నాయి. అధికారి మాత్రమే డిజిటల్‌ ‘కీ’ ద్వారా లాగిన్‌లోకి వెళ్లి నమోదు, క్లియరెన్స్‌ చేయడం వంటివి చేయాలి. కానీ పనిభారం, ఇతరత్రా కార్యక్రమాలతో ఆపరేటర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో కొందరు డిజిటల్‌ ‘కీ’ని అవకాశంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రికార్డులను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిదే ఆధిపత్యం నడుస్తుండగా.. ప్రభుత్వ ఉద్యోగులు డమ్మీలుగా మారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement