బాల్యవివాహాలను అరికట్టాలి! | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను అరికట్టాలి!

Published Thu, Jul 20 2023 12:58 AM

- - Sakshi

నారాయణపేట: బాల్యవివాహాలను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు దేవయ్య అన్నారు. బుధవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో బాలల హక్కుల పరిరక్షణ అంశాలపై ఓరియంటేషన్‌ కమ్‌ సెన్సిటిజషన్‌ ప్రోగ్రాం ఆన్‌చైల్డ్‌ రైట్స్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. పోక్సో కేసుల విషయంలో ఎంతో సున్నితంగా ఉండాలన్నారు.

పోక్సో కేసులపై సీరియస్‌గా ఉంటుందని పీఎస్‌లలో వారికి రక్షణ కల్పించాలన్నారు. ప్రొటెక్షన్‌, ప్రాసిక్యూషన్‌ అనే అంశాలపై పోలీసులు ఫోకస్‌ చేయాలన్నారు. జిల్లా మ్యాపింగ్‌ తీసుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సక్సెస్‌ స్టోరీపై పిల్లలకు గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ హాస్టళ్లను చక్కగా నిర్వహించాలని ఎస్సీ అధికారికి ఆదేశించారు. అదేవిధంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్‌ దేశ భవిష్యత్‌ గర్వపడేలా అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు.

పోక్సో చట్టం ద్వారా కేసులు నమోదు చేసి చార్జీషీట్‌ వేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. షీటీమ్స్‌ ద్వారా కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ అశోక్‌శ్యామల మాట్లాడుతూ సీడబ్ల్యూసీ కమిటీ పరిధిలో 675 కేసులు నమోదైనట్లు తెలిపారు. డీడబ్ల్యూఓ వేణుగోపాల్‌ మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడానికి 24గంటలు పని చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ సహాయంతో 300 మంది పిల్లలను గుర్తించి, వారిని గురుకుల పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. ఆపరేషన్‌ ముస్కాన్‌, స్మైల్‌ ప్రోగ్రాం, షీటీ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం నిర్వస్తున్నట్లు తెలిపారు.

డీఎంహెచ్‌ఓ మాట్లాడూతూ బాలబాలికల ఆరోగ్య పరిస్థితులను తన సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లాలోని 704 అంగన్‌వాడీ కేంద్రాల్లో 50,276 మందిలో బాలికలు 24,823 , బాలురు 25,453 ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో నార్మల్‌ డెలవరీలలో మొదటిస్థానంలో ఉందని డీఎంహెచ్‌ఓ అన్నారు. టీఎస్‌సీపీసీఆర్‌ కమిటీ సభ్యులు దేవయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు, అధికారులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement