లోక్‌అదాలత్‌లో 3,790 కేసులు పరిష్కారం | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో 3,790 కేసులు పరిష్కారం

Published Sun, Sep 10 2023 12:34 AM

జిల్లా కేంద్రంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ  - Sakshi

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 3,790 కేసులు పరిష్కరించినట్లు.. సమస్య ఏదైనా గొడవలకు పాల్పడకుండా రాజీమార్గంలో వెళ్తే సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్‌ డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ కక్షిదారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంతో ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులో తెలియపరిచి రాజీకుదుర్చుకోవచ్చని సూచించారు. లోక్‌ అదాలతో రాజీపడదగు క్రిమినల్‌, సివిల్‌, భూతగాదాల కేసులు, మోటార్‌ వెహికల్‌, రోడ్డు ప్రమాదాలు, వివాహ కుటుంబ తగదా కేసులు, బ్యాంకు, చెక్‌ బౌన్స్‌, విద్యుత్తు చోరీ, వినియోగదారుల ఫోరం, ట్రాఫిక్‌, ఈ చలన్‌, ప్రీలిటిగేషన్‌ సంబంధించి 3,430 పెండింగ్‌ కేసులు పరిష్కరించామన్నారు. రూ.9.08లక్షలు జరిమానా వసూలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి డిస్ట్రిక్‌ లీగల్‌ సర్వీసెస్‌ ఆథారిటీ జి.శ్రీనివాస్‌, న్యావాదులు మహ్మద్‌ ఉమర్‌, సయ్యద్‌ జాకీయ సుల్తానా, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, హ్యూమన్‌ రైట్స్‌ యాంటీ కరప్షన్‌ ఫ్రం ఢిల్లీ బ్రాంచ్‌ ఆఫ్‌ నారాయణపేట వారి ఆధ్వర్యంలో కక్షిదారులకు న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్ధుల్‌ రఫీ ,సెక్రటరీ సినియర్‌ సివిల్‌ జడ్జి జి.శ్రీనివాస్‌ చేత అల్ఫాహారం, అరిటి పండ్లు పంచారు.

కోస్గిలో 1250 కేసులు..

కోస్గి: జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా శనివారం కోస్గి జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో ఒకేరోజు 1250 కేసులను పరిష్కరించారు. న్యాయమూర్తి ఫరీన్‌ బేగం ఆయా కేసులకు సంబందించి వాదనల అనంతరం కేసులను పరిష్కరించారు. సంవత్సరాలపాటు కోర్టుల చుట్టు తిరగకుండా రాజీ చేసుకోవడం ఉత్తమ మార్గమని, ఇందుకు లోక్‌ అదాలత్‌ మంచి వేదిక అంటూ న్యాయ శాఖ, పోలీస్‌ శాఖ ప్రచారం చేయడంతో మంచి స్పందన వచ్చింది. కోస్గి, మద్దూర్‌, దామరగిద్ద మండలాలకు సంబందించిన కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు జాదవ్‌ రావు, పీపీ అభినవ్‌తోపాటు న్యాయవాదులు, ఆయా మండల పోలీస్‌ స్టేషన్ల నుంచి కోర్టు కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

రాజీమార్గంతో సత్వర న్యాయం పొందొచ్చు

జిల్లా ప్రధాన న్యాయమూర్తిమహ్మద్‌ అబ్దుల్‌ రఫీ

Advertisement
Advertisement