‘అడ్డా’ బతుకులు | Sakshi
Sakshi News home page

‘అడ్డా’ బతుకులు

Published Thu, Nov 9 2023 1:22 AM

- - Sakshi

వనపర్తిలోని అడ్డాపై పనుల కోసం వేచి చూస్తున్న కూలీలు

రోజు కూలితో బతుకులీడుస్తున్న కూలీలు

వనపర్తి టౌన్‌/పెబ్బేర్‌ రూరల్‌: రోజువారీ కూలి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అడ్డా కూలీలు. ఉదయాన్నే ఇంటి పనులు చక్కదిద్దుకొని పూట గడిచేందుకు అడ్డాపైకి చేరి కూలీ పనుల కోసం పడిగాపులు పడుతుంటారు. స్థానికంగా ఉపాధి లేక అడ్డా కూలే జీవనంగా గడుపుతున్నవారు కొందరైతే.. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక మహిళలు, పురుషులు ఆటోలు, జీపులు, బస్సుల్లో పట్టణంలోని అడ్డాపైకి వచ్చేవారు మరికొందరు. వచ్చిన కూలీలో కొంత రవాణా చార్జీలకు వెచ్చిస్తుండగా.. పని దొరికితే సంతోషం, లేదంటే రాను పోను ఛార్జీలు చేతినుంచి భరించే పరిస్థితి. ఎవరైనా అడ్డా మీదికి వచ్చారంటే చాలు.. ఏ పని ఉంది అంటూ వందలమంది గుమిగూడుతారు. ఉదయం ఏడు గంటల వరకే అడ్డా మీదకు చేరుకొని మధ్యాహ్నం వరకు వేచి చూసి పని దొరకకుంటే నిరాశగా వెనుదిరుగుతారు. వీరికి కార్మికశాఖ అందించే ప్రయోజనాలపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో కనీసం గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు. ఆధునిక సమాజంలో పాలకులు మారినా తమ బతుకులు మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఇంటి స్థలం, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని, మహిళా కూలీల రక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆకతాయిలు వేధింపులకు గురిచేసిన ఘటనలూ ఉన్నాయి. అడ్డా కూలీలకు వయసుతో సంబంధం లేకుండా నెల నెల పింఛన్‌ ఇవ్వాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

సరైన సౌకర్యాలు కల్పించని పాలకులు

ఎలాంటి ప్రయోజనాలకునోచుకోని వైనం

ఆర్థిక భద్రత కల్పించాలని వేడుకోలు

చిమనగుంటపల్లి నుంచి ఆటోలో వచ్చిన అడ్డా కూలీలు
1/1

చిమనగుంటపల్లి నుంచి ఆటోలో వచ్చిన అడ్డా కూలీలు

Advertisement
Advertisement