ఆర్టీసీ ‘పరిరక్షణ’ నామమాత్రం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ‘పరిరక్షణ’ నామమాత్రం

Published Tue, Nov 14 2023 1:36 AM

-

నారాయణపేట రూరల్‌: ప్రైవేటు వాహనాల నుంచి ఆర్టీ సీని సంరక్షించాలని నిర్వహిస్తున్న ‘పరిరక్షణ’ కార్యక్రమం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు డిపోకు సంబందించిన కార్మికులు, ఉద్యోగులు సెలవురోజుల్లో బస్టాండ్‌ బయట ప్రైవేటు వాహనాలు నిలపకుండా, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎక్కె విధంగా ప్రోత్సహిచాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ప్రైవేటు కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే కలిగే లాభాలు తెలియచెప్పాలి. అయితే కార్యక్రమంపై సోమవారం ‘సాక్షి’ పరిశీలించగా విధులు నిర్వహించాల్సిన పరిరక్షణ ఇంచార్జీలు బస్టాండ్‌లో ప్యాసింజర్లు మాదిరి కుర్చిలపై కుర్చొని కాలక్షేపం చేశారు. సమయం అయిపోయేటప్పుడు బస్టాండ్‌ బయటకు వెళ్లి డ్యూటీ చేస్తున్నట్లు ఫొటో దిగి వారి గ్రూప్‌లో పోస్ట్‌ చేసి వెళ్లిపోయారు. అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement