Sakshi News home page

కొత్త ఓటర్లు @ 1,13,550

Published Thu, Nov 16 2023 1:12 AM

- - Sakshi

ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా

గద్వాలలో 12,385 మంది..

వనపర్తి: ప్రస్తుత అసెంబ్లీ పోరులో కొత్త ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఈ నెల 10న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి పాలమూరులోని 12 నియోజకవర్గాల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్న యువత 1,13,550 మంది ఉన్నారు. గెలుపు ఓటములను శాసించే స్థాయిలో కొత్త ఓటర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 12,385 మందికి ఉండగా.. అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో 7,116 మంది ఉన్నారు.

వనపర్తిలో అత్యధిక ఓటర్లు..

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అత్యధికంగా వనపర్తిలో 2,71,151 మంది ఓటర్లు ఉన్నట్లు తాజా ఓటర్ల విడుదలతో స్పష్టమవుతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువ ఓటర్లు 12,073 ఉన్నారు.

ఆకర్శించేందుకు ప్రయత్నాలు..

కొత్త ఓటర్లను ఆకర్శించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో క్రికెట్‌ కిట్లు పంపిణీ చేశారు.

నియోజకవర్గాల వారీగా

కొత్త ఓటర్ల వివరాలు..

యువ ఓటర్లు ఎటువైపు?

సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండే యువ ఓటర్ల మద్దతు ఎటువైపు ఉంటుందోనన్న భయం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. వారిని ప్రసన్నం చేసుకున్న వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో గెలు పును నిర్ణయించే అవకాశం కొత్త ఓటర్లకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement