పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Published Tue, Nov 21 2023 12:34 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న పోలీస్‌ సిబ్బంది   - Sakshi

నారాయణపేట: జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవాలన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో 75 మందికి 68 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకున్నారన్నారు. ఆర్టీసీ 19 మందికి 11 మంది ఉపయోగించుకున్నారు. అలాగే వెబ్‌ కాిస్టింగ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల, అశోక్‌కుమార్‌, ఆర్డీఓ రాంచందర్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహశీల్ధార్‌ రాణా ప్రతాప్‌, డీఎఫ్‌ఓ రాణప్రతాప్‌ తదితరులు ఉన్నారు.

21 నుంచి 26 వరకు శిక్షణ

నారాయణపేట: ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 21,22 తేదీల్లో ఓపీఓలకు, 25,26 తేదీల్లో పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా అధికారులు ఎక్కడికి వెళ్లరాదన్నారు. స్టాఫ్‌కు శిక్షణ ఇచ్చింది లేనిది తెలపాలని కలెక్టర్‌ అన్నారు. అధికారులు తప్పులు లేకుండా చూసుకోవాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు పీఓ, ఏపీఓ, ఓపీఓ శిక్షణ కేంద్రాన్ని, టీఎస్‌ సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల స్కూల్‌ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, జిల్లా అధికారులు ఉన్నారు.

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష
1/1

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

Advertisement
Advertisement