ఎన్నికల నిబంధనలు పాటించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు పాటించాలి

Published Wed, Nov 29 2023 12:42 AM

పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌  
 - Sakshi

నారాయణపేట: జిల్లాలో నవంబర్‌ 30న ఎన్నికలు జరుగుతున్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఇంటింటా ప్రచారం లాంటివి చేయరాదని, ఎన్నికల నిబంధనలు పాటించాలని.. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్‌ 4వ తేది రకు జిల్లా పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. మంగళవారం ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. 144 సెక్షన్‌ అమలు సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ వ్యక్తులతో ఉండడం నిషేధమన్నారు. అలాగే, ప్రచారానికి వచ్చిన వాళ్లు, లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీల వారు ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు. లాడ్జిలలో బస చేయడినకి ఎవ్వరైన ఆస్పత్రిలో, మరి ఏ ఇతర వ్యక్తిగత కారణాలతో వచ్చినట్లయితే వారు పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత అనుమతించాలన్నారు.

ఓటర్లను ప్రభావితం చేస్తే చర్యలు

ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీ బ్యానర్లు, లోగోలతో షామియానా మొదలైన ఏ ఏర్పాట్లు చేయరాదన్నారు. ప్రజల ఓట్లు పొందడానికి ఎవరైనా లేదా రాజకీయ పార్టీలు అయినా ఎలాంటి మైక్‌లు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను ఉపయోగించి ప్రచారం చేయడం, సమూహంగా ఉన్నట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలింగ్‌ జరిగే రోజు కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అంతరాయం కలిగించే ఏదైనా మండే పదార్థాలు టపాకాయాలు, ఇతర పదార్థాలను తీసుకెళ్లరాదన్నారు. ఓటర్లను ఎవ్వరూ ప్రలోభపెట్టకూడదని, భయబ్రాంతులకు గురిచేయవద్దన్నారు. 30వ తేది సాయంత్రం 5గంటల వరకు కల్లు దుకాణాలు, వైన్స్‌ షాపులు మూసి వేయాలన్నారు. డిసెంబర్‌ 3వ తేదీన ఈ నిబంధనలు పాటించాలని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరు ఉల్లంఘించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలు

ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

Advertisement
Advertisement