ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. ఉద్యోగిపై వేటు | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. ఉద్యోగిపై వేటు

Published Wed, Nov 29 2023 12:42 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిపై వేటు పడింది. ఎకై ్సజ్‌ శాఖలో మహబూబ్‌నగర్‌ ఎస్‌హెచ్‌ఓ పరిధిలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఉషారాణి శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేశారు. దీనిని పరిగణలోకి తీసుకొని ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ సైదులు తెలిపారు.

రూ.3.51కోట్ల

మద్యం సీజ్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎకై ్సజ్‌ పోలీసులు బెల్ట్‌ దుకాణాలతో పాటు ఇతర మద్యాన్ని అక్రమంగా సరఫరా చేయకుండా కట్టడి చేయడం జరిగింది. నెల రోజుల సమయంలో జిల్లావ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 58 లీటర్ల మద్యం సీజ్‌ చేశారు. ఇక జిల్లాలో బెల్ట్‌ దుకాణాలతో పాటు ఎన్నికల కోసం తరలించే మద్యం ఐఎంఎల్‌ 3,531లీటర్లు, బీరు 623 లీటర్లు సీజ్‌ చేశారు. నాలుగు వాహనాలు సైతం సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన మద్యం విలువ రూ.3.51కోట్లు ఉండటం విశేషం.

వరికి రికార్డు ధర

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం వ్యాపారస్తులు పోటీ పడి ధరలు కోడ్‌ చేయడంతో సోనా క్వింటాకు గరిష్టంగా రూ.3,141 ధర పలికింది. అలాగే, హంస క్వింటాకు గరిష్టంగా రూ.3,061, కనిష్టంగా రూ.1,501, కందులు (ఎరుపు) క్వింటాకు గరిష్టంగా రూ.10,855, కనిష్టంగా రూ.9,958, కందులు (తెల్లవి) గరిష్టంగా రూ.10,859, కనిష్టంగా రూ.9,800 పలికాయి.

ఆర్‌ఎన్‌ఆర్‌ ధర రూ.2,931

దేవరకద్ర: స్థానిక మార్కెట్‌ యార్డులో మంగళవారం జరిగిన ఈనామ్‌ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,931, కనిష్టంగా రూ.2,350గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,881, కనిష్టంగా రూ.1,789గా ధరలు వచ్చాయి. ఆముదాల ధర గరిష్టంగా రూ.5,200గా ఒకే ధర వచ్చింది. మార్కెట్‌కు దాదాపు 5 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement
Advertisement