అనగనగా ఓ రైల్వేస్టేషన్‌.. అక్కడ ఏ సౌకర్యాలు ఉండవ్‌

4 May, 2022 15:46 IST|Sakshi
అతి పురాతన పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌

పర్లాకిమిడి(భువనేశ్వర్‌): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు ఏళ్లుగా సేవలందిస్తున్న పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు అధికంగా ఆదాయం వస్తున్నా అభి వృద్ధి చేయడంలో మాత్రం శీతకన్ను వహిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాష్ట్రానికి చెందినవారు అయినా ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ. 10 కోట్లు తప్ప, ఇతర మౌలిక సౌకర్యాలకు నిధుల కేటాయించలేదని పలువురు విమర్శిస్తున్నారు.  

ప్లాట్‌ఫారం ఎత్తు పెంచేదెన్నడో..?
పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారం ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎత్తు తక్కువగా ఉండడంతో వయోవృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. కొందరైతే ట్రైన్‌ ఎక్కేందుకు ప్లాస్టిక్‌ కుర్చీలు తెచ్చుకుంటున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కనీసం షెల్టర్‌ కూడా నిర్మించలేదు. ఇదివరకు సుమారు రూ.3,050 కోట్లతో పర్లాకిమిడి–గుణుపురం–తెరువల్లి–రాయగడ రైల్వేలైన్‌ అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా రైల్వేశాఖ అధికారులు, స్థానిక నాయకులు స్పందించి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

చదవండి: అమ్మానాన్న ప్లీజ్‌ నన్ను క్షమించండి.. కరిష్మా సూసైడ్‌ లేఖ


 

మరిన్ని వార్తలు