ఏడాది పాలన పూర్తి.. బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్‌

7 May, 2022 13:14 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తైన సందర్భంగా శనివారం ఆయన బస్సులో ప్రయాణించి.. ప్రయాణికులతో సరదాగా సంభాషించారు. 

తమిళనాడు ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ‘మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ (ఎంటీసీ)..  చెన్నై రాధాక్రిష్ణన్‌ సాలై(రోడ్‌) రూట్‌లో బస్సు నెంబర్‌ 29-సీలో ఎంకే స్టాలిన్‌ ప్రయాణించారు. ప్రత్యేకించి మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ పథకం గురించి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు.. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్‌ అన్నాదురై, తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలకు ఆయన నివాళులు అర్పించారు. ఆపై ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అసెంబ్లీలో పలు సంక్షేమ పథకాలను ప్రకటించారాయన. 

తమిళనాడులో పదేళ్లు ప్రతిపక్ష హోదాలో కొనసాగిన తర్వాత.. ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కిందటి ఏడాది అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన 2006-11 మధ్య కరుణానిధి ప్రభుత్వంలో స్టాలిన్‌ ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.

చదవండి: ప్రశాంత్‌ కిశోర్‌ కామెంట్‌పై నితీశ్‌ కుమార్‌ కౌంటర్‌

మరిన్ని వార్తలు